సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాగానే తన 27 వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయాలనీ అనుకున్నప్పటికీ కథ అంత గా నచ్చక పోవడం తో హోల్డ్ లో పెట్టి గీత గోవిందం ఫేమ్ పరుశురాం చెప్పిన కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మే 31న కృష్ణ బర్త్డే సందర్భంగా తన 27వ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయాలని మహేష్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీలైతే మే 31న లిమిటెడ్ టీమ్ మహేష్ – పరుశ్ రామ్ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకోనుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. టైటిల్ని బట్టి చూస్తుంటే చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగుతుందని అర్ధమవుతుంది. మరి నిజంగా ఇదే టైటిలా లేక మరొకటా అనేది చూడాలి.