మహేష్ సర్కారీ తర్వాత రాజమౌళి తో కాదు..

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని గత కొన్నేళ్లు గా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించారు రాజమౌళి. ఓ ఇంటర్వ్యూ లో నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తోనే అని ప్రకటించి అభిమానుల్లో ఆనందం నింపారు. దుర్గ ఆర్ట్స్ బేనర్‌పై కేఎల్ నారాయణ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు స్వయంగా రాజమౌళి చెప్పుకొచ్చాడు.

ఈ ప్రకటన తర్వాత మహేష్ అభిమానులంతా కూడా సర్కారీ వారి పాట తర్వాత రాజమౌళి డైరెక్షన్లో నటించడం ఖాయమని అంత ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా రాజమౌళి తో సినిమాకు మరింత సమయం పట్టడం తో ఈ గ్యాప్ లో మరో డైరెక్టర్ తో సినిమా చేయాలనీ రాజమౌళి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. లాక్ డౌన్ వల్ల ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు బాగా లేట్ అయింది.

రాజమౌళి ఇంకాస్త ఎక్స్ ట్రా టైమ్ కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు వచ్చే ఏడాది వేసవి వరకు ఈ సినిమా షూటింగ్ తోనే సరిపోయేలా ఉంది. దాంతో మహేష్ మరో డైరెక్టర్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడట. మరి ఆ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి.