Site icon TeluguMirchi.com

గుట్టు విప్పేది రేపే..!

mahesh-babu-jan-16మ‌హేష్‌బాబు సినిమా టైటిలేమిటి..? గ‌త కొన్ని రోజులుగా ఈ విష‌యం మీదే ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూటకో టైటిల్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. మ‌హేష్ సినిమాకి ఏ టైటిల్ పెడ‌తారు..? అని విషయంపై చిన్నపాటి పందాలూ సాగుతున్నాయి. ఈ ఉత్కంఠ‌త‌కు తెర‌ప‌డేది రేపే. మే 31న కృష్ణ జ‌న్మదినం. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు – సుకుమార్‌ల ఫస్ట్ లుక్‌ని విడుద‌ల చేయాల‌నుకొంటున్నారు. దానితో పాటు టైటిల్ కూడా ప్రక‌టిస్తారు. కోలంబ‌స్‌, నేనొక్కడినే, ది ప్రిన్స్ పేర్లలో ఒక‌దాన్ని ఎంపిక చేసే అవ‌కాశాలున్నాయి. మ‌రి మ‌హేష్ ఓటు దేనికో చూడాలి.

Exit mobile version