Site icon TeluguMirchi.com

పుట్టిన రోజు నాడు మహేష్ ఏపని చేసాడో తెలుసా ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు 45 వ ఏటా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనకు అభిమానులు , సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెష్ అందజేశారు. ప్రస్తుతం కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అలాంటి వేడుకలకు దూరంగా ఉండాలని మహేష్ కోరడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కాగా పుట్టిన రోజు నాడు మహేష్..గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. త‌న‌ పుట్టిన రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్ చేశాడు ప్రిన్స్‌. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తార‌క్‌, విజ‌య్‌, శృతి హాస‌న్‌ను నామినేట్ చేశారు మ‌హేష్ బాబు. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరారు మ‌హేష్ బాబు. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌ని మ‌హేష్ బాబు పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది.

Exit mobile version