Site icon TeluguMirchi.com

యూర‌ప్ చుట్టేస్తాడు..

Mahesh-Babu-Nenokkadineప్రిన్స్ మ‌హేష్‌బాబు.. త్వర‌లోనే యూర‌ప్ చుట్టేయ‌నున్నాడు. వ‌న్ సినిమా కోసం. సుకుమార్ దర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్రమిది. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెర‌కెక్కిస్తోంది. త‌ర‌వాతి షెడ్యూలుని యూర‌ప్‌లో తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేసింది యూనిట్‌. అర‌వై రోజుల పాటు అక్కడే షూటింగ్ జ‌రుగనుంది. జూన్ 18న ఐర్లాండ్‌.. విమానం ఎక్కేస్తారు. బెల్ఫాస్ట్‌లో కీల‌క భాగం తెర‌కెక్కిస్తారు. ఓ తెలుగు సినిమా.. అక్కడ షూటింగ్ జ‌రుపుకోవ‌డం ఇదే తొలిసారి. ఇటీవ‌లే వ‌న్ టీజ‌ర్ ముందుకొచ్చింది. ఈ టీజర్‌ని ఊహించిన‌దానికంటే ఎక్కువ స్పంద‌న రావ‌డంతో… చిత్రబృందానికి టానిక్ ల‌భించింది. అదే జోరుతో.. యూర‌ప్ బ‌య‌ల్దేరుతున్నారు.

Exit mobile version