నటి, నిర్మాత, మంచు మోహన్ బాబు కుమార్తె అయిన మంచు లక్ష్మి ప్రసన్న ఈ రోజు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేరళ లోని ఒక ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న చిన్న బోటు బోల్తా పడటంతో ఆమె, ఆమెతో షాట్ లో వున్న మరో నటుడు నీళ్ళల్లో పడిపోయారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహానికి ఎదురుగా షుమారు కిలో మీటర్ దూరం ఈదుకుంటూ ఆమె ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటన గురించి ఆమే స్వయంగా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆమెకు ఈత రావటం ఇవాళ ఆమె ప్రాణాలు కాపాడింది. కేరళ లోని ప్రసిద్ధ అలేప్పియా సరస్సులో ఈ సంఘటన జరిగిందని, ఒక ఫిషింగ్ బోటు తమ ప్రాణాలు కాపాడిందని లక్ష్మి తెలియచేసారు. కంగ్రాట్స్ లక్ష్మీ !!