‘ఫిదా’ తో అందర్నీ ఫిదా చేసిన శేఖర్ కమ్ముల..కాస్త గ్యాప్ తర్వాత నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా పెట్టి లవ్ స్టోరీ అనే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ ఈ సినిమా చేయడం..అందులోనూ సాయి పల్లవి , నాగ చైతన్య లు నటించడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.
ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం తో అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి షూటింగ్ రెడీ చేయబోతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రత్యేక సెట్ నిర్మిస్తున్నారు. ఆ సెట్ లోనే సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది.