Site icon TeluguMirchi.com

గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసిన లవ్ స్టోరీ

‘ఫిదా’ తో అందర్నీ ఫిదా చేసిన శేఖర్ కమ్ముల..కాస్త గ్యాప్ తర్వాత నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా పెట్టి లవ్ స్టోరీ అనే ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ ఈ సినిమా చేయడం..అందులోనూ సాయి పల్లవి , నాగ చైతన్య లు నటించడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.

లాక్ డౌన్ అనంతరం సినిమా షూటింగ్ మొదలు పెట్టి త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నారు. కేవలం ఇంకా 15 రోజులు మాత్రమే షూటింగ్ మిగిలి ఉండడం తో జులై లో అది పూర్తి చేసి ఆగస్టు లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని భావిస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు కారణం సినిమా కాంబినేషన్. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. దానికి తోడు సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం. అందుకే వీరి జోడీపై అంచనాలు పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది.

Exit mobile version