అందాల రాక్షసి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచమైన లావణ్య త్రిపాఠి..ప్రస్తుతం ఐరెన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. ఇప్పటికే అమ్మడు చాల సినిమాలే చేసినప్పటికీ..వాటిల్లో హిట్స్ అయ్యినవి మాత్రం రెండు , మూడే..దీంతో అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి. తాజాగా అర్జున్ సురవరం తో హిట్ అందుకుంది. అయితే ఈ భామ లిప్ లాక్ లకు దూరం అని చెప్పి షాక్ ఇచ్చిది.
ఈ కాలంలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం కామన్ అయ్యింది. ఇలాంటి సమయంలో నో ముద్దు అని చెప్పినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. అసలే లావణ్యకు పెద్దగా ఆఫర్లు లేవు.. స్టార్ హీరోల సినిమాలకు పరిశీలించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో కొత్త కొత్త కండిషన్లు పెట్టి ఆఫర్లు ఇవ్వబోయేవారిని కూడా బెదరగొట్టడం ఎందుకని ఫిలిం నగర్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.