లక్ష్మీ బ్యారేజీ పిల్లర్‌ కుంగినా.. చెక్కుచెదరని కాళేశ్వ‌రం ప్రాజెక్టు..!


తెలంగాణ‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజిని నిర్మించారు. గోదావరి నదీ జ‌లాల‌ను.. తాగునీరు, నీటిపారుదల కోసం, ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా, ఈ లక్ష్మీ బ్యారేజి నిర్మించబడింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ప్ర‌ముఖ ఎల్ అండ్ టి కాంట్రాక్టు సంస్థ నిర్మించిన లక్ష్మీ బ్యారేజిని నిర్మించింది. దీని పొడవు 1.632 కి. మీ ఉండ‌గా, మొత్తం 85 గేట్లు ఉన్నాయి. ఈ బ్యారేజీ 16.17 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (టిఎంసి) నిల్వ సామర్థ్యం కలిగి ఉండ‌గా, గరిష్టంగా 80,000 క్యూమెక్స్ వరద నీటి విడుదలను తట్టుకోగలదు. 2019లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో లక్ష్మీ బ్యారేజీ ప్రారంభోత్సవం జరిగింది.

లక్ష్మీ ప్రాణ‌హిత‌ నది సంగమంకు దిగువున ఎంతో వ్యూహాత్మ‌కంగా ఈ ల‌క్ష్మీ బ్యారేజీని నిర్మించారు.ఇక లక్ష్మీ బ్యారేజీ ప్రాణహిత నది దిగువ‌న ఉంది. గోదావ‌రి న‌దీ జ‌లాల నుంచి రోజుకు 2 (టిఎంసి)ల‌తో పాటు, అదనంగా మ‌రో టిఎంసి నీటిని లిఫ్ట్ చేసే నిబంధనతో, ప్ర‌తి ఏటా మొత్తం 160 టిఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా ఈ కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారు. నీటిని ఎత్తిపోసేందుకు, ల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి, పార్వ‌తి, గాయ‌త్రి పంపు హౌసుల్లో ఏర్పాటు చేసిన పంపుల సామ‌ర్థ్యం విష‌యంలో దేనిక‌వే విశిష్ట‌మైన‌వి.

ఈ బ్యారేజీలు, ఒక్కొక్కటి రోజుకు రెండు టిఎంసిల నీటిని లిఫ్టింగ్ చేసే సామర్థ్యంతో నిర్మించారు. అయితే ప్ర‌స్తుతం లక్ష్మీ బ్యారేజీ వ‌ద్ద కొన్ని పిల్ల‌ర్లు కుంగుబాటుకు గుర‌య్యాయి. ముఖ్యంగా అక్క‌డ‌ కాంక్రీట్‌ నిర్మాణంతో ఉన్న పియర్ కుంగింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆప‌రేట‌ర్ అయిన ఎల్ ఎండ్ టి (L&T) నిపుణుల క‌మిటీనీ ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలో ల‌క్ష్మీ బ్యారేజీకి ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని, అక్క‌డ కాంక్రీట్ నిర్మాణంలో ఉన్న పియ‌ర్ కుంగ‌డంతో పెద్ద శ‌బ్థం వ‌చ్చింద‌ని ఆ సంస్థ ప్ర‌తినిథులు వెల్ల‌డించారు. అలాగే ఈ బ్యారేజీ వ‌ద్ద‌ దెబ్బతిన్న స్తంభాలను పునరుద్ధరించడానికి ఎల్ ఎండ్ టి నిపుణుల క‌మిటీ నివేదిక‌ను స‌మ‌ర్ఫించ‌నున్నారు.

కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్ లక్ష్మీ బ్యారేజీ ముఖ్యాంశాలు రాష్ట్రంలోని వేలాది హెక్టార్ల భూములకు సాగునీరును ల‌క్ష్మీ బ్యారేజీ అందజేస్తుంది. ఈ బ్యారేజీలో 85 హైడ్రోమెకానికల్ రేడియల్ గేట్‌లను భారీ కాంక్రీట్ స్తంభాల మధ్య అమర్చారు. నిర్మాణంలో 7 బుర్జ్ ఖలీఫాల నిర్మాణానికి సమానమైన కాంక్రీటును, 15 ఈఫిల్ టవర్‌ల నిర్మాణానికి సమానమైన ఉక్కును, 6 పిరమిడ్‌ల కోసం భూమిని తవ్వారు.

ప్రాణహిత అనేది వార్ధా, పైంగంగా మరియు వైంగంగా నదులతో సహా అనేక చిన్న ఉపనదుల సంగ‌మం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 13 జిల్లాల ద్వారా సుమారు 500 కిమీ దూరం వరకు 7 లింకులు మరియు 28 ప్యాకేజీలుగా విభజించబడింది. అలాగే 1,800 కిమీ కంటే ఎక్కువ కాలువ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటుంది. మొత్తం 240 టిఎంసి అన‌గా మెడిగడ్డ బ్యారేజ్ నుండి 195, శ్రీపాడ యల్లంపల్లి ప్రాజెక్టు నుండి 20 మరియు భూగర్భజలాల నుండి 25 ఉత్పత్తి చేయాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది, వీటిలో 169 నీటిపారుదల కోసం, 30 హైదరాబాద్ మునిసిపల్ నీటికి, 16 ఇతర పారిశ్రామిక అవసరాలకు మరియు 10 కి సమీప గ్రామాల్లో తాగునీరు, మిగిలినవి బాష్పీభవన నష్టాన్ని అంచనా వేస్తుంది. అంతే కాకుండా ప్రాజెక్ట్ మొత్తం సాగు చేయదగిన కమాండ్ ఏరియా అంటే అకౌంటింగ్ తర్వాత నీటిపారుదల చేయగల స్థిరమైన ప్రాంతాన్ని పెంచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది