కుష్బూ కంటికి ఏమైంది..?

సీనియర్ నటి , రాజకీయ నేత కుష్భు కంటికి గాయమైంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ‘హాయ్‌.. ఫ్రెండ్స్‌.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి కత్తి తగిలి చిన్నపాటి గాయమైంది. దీంతో డాక్టర్లు నా కంటికి ఆపరేషన్‌ చేసి కుట్లు వేశారు. కొద్దికాలం ట్విటర్‌కు దూరంగా ఉండబోతున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తా.. అందరూ భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించండి ‘ అంటూ కుష్బూ ట్వీట్‌‌ చేసింది.

Hi friends, will be inactive for a while as I had to go under a knife for my eye this morning.. promise to be back soon. Take care, wear a mask if heading out and maintain a distance. ❤ pic.twitter.com/K7d5plvsym— KhushbuSundar ❤️ (@khushsundar) August 19, 2020