Site icon TeluguMirchi.com

రామోజీకి కేటీఆర్ స్పెషల్ థ్యాంక్స్

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటునందిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 కోట్ల విరాళం ప్రకటించినందుకు ట్విటర్‌లో కృతజ్ఞతలు చెప్పారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు రూ.20 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు పది కోట్ల రూపాయల చొప్పున ఈ విరాళాన్ని అందించారు. ఆర్థికంగా తెలుగు వారికి చేదోడుగా నిలవాలన్న లక్ష్యంతో రామోజీరావు తన గ్రూపు సంస్థల తరఫున ఈ విరాళాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు అందించారు.

Exit mobile version