Site icon TeluguMirchi.com

కోన‌వెంక‌ట్ కాన్ఫిడెన్స్‌…

Kona Venkatఫ్లాపురాజా.. ర‌వితేజ – బ‌లుపు సినిమాతో హిట్టు కొట్టడ‌మే కాద‌ట‌. కొత్త రికార్డులు కూడా సృష్టిస్తాడట‌. ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు. స్వయంగా ఈ సినిమాకి ప‌ని చేసిన కోన వెంక‌ట్ చెబుతున్నారు. ఈ సినిమా ఆయ‌న చూసేశార‌ట‌. అవుట్‌పుట్ అద్భుతంగా వ‌చ్చింద‌ని ఆయ‌న సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ర‌వితేజ రికార్డులు సృష్టించ‌బోతున్నాడు – అని ఢంకా బ‌నాయించి మరీ చెబుతున్నాడు. కోన ఏమిటి? ఇంత కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాడు? అని అంద‌రూ ఆశ్చర్యపోతున్నాడు. ఇండ్రస్ట్రీ రికార్డులు అంటే మ‌గ‌ధీర రికార్డును కూడా బద్దలు కొడ‌తాడా? అని ముక్కున వేలేసుకొన్నారు. అంత‌లోనే తన త‌ప్పు తెలుసుకొన్న కోన‌.. రికార్డ్ అంటే ఇండ్ర‌స్ట్రీ రికార్డులుకాదులెండి. ర‌వితేజ పాత సినిమా రికార్డులు…. అని క‌వ‌రింగ్ ఇచ్చుకొన్నాడు. మ‌రి కోనది కాన్ఫిడెన్సో.. ఓవ‌ర్ కాన్ఫిడెన్సో తెలియాలంటే ఈనెల 28 వ‌ర‌కూ ఆగాలి. ఎందుకంటే ర‌వితేజ బ‌లుపు చూపించేది అప్పుడే.

Exit mobile version