Site icon TeluguMirchi.com

జగన్ కోసం కిరణ్?

kiran for jaganముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు చాలా చిత్రంగా కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికి ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకున్నారు. ఒకరు శంకర్రావు. ఇంకొకరు రవీంద్రారెడ్డి. చిత్రమేమిటంటే, ఈ ఇద్దరూ కూడా వైఎస్ కు ఆది నుంచీ వ్యతిరేకులే. ఆయన అందరినీ ఆదరించినా వీరిని మాత్రం దరిచెర్చుకోలేదు. శంకర్రావు కారణంగానే జగన్ అవినీతి తేనెతుట్ట కదిలింది. మొత్తం రాష్ర్ట రాజకీయ ముఖచిత్రాన్నేమార్చేసింది. చిత్రమేమిటంటే కొద్ది రోజుల్లోనే శంక్రరావు తన పదవిని కొల్పొవాల్సి వచ్చింది. ఇక డిఎల్ రవీంద్రారెడ్డి. సీమలోని నాయకుల్లో వైఎస్ కుటుంబంతో అంతగా పొసగని వాడు. ఇప్పుడు అతగాడ్నీ బయటకు నెట్టేసారు. ఇదంతా చూస్తుంటే కిరణ్ కావాలని జగన్ కు మేలు చేస్తున్నాడా అని అనిపస్తుంది. కానీ వైకాపా వర్గాలు చూస్తే, కిరణ్ తెలుగుదేశం ఆడించినట్లు ఆడుతున్నాడని ఆరోపిస్తుంటాయి. ఈయన చూస్తే జగన్ కు మేలు చేసే నిర్ణాయాలు తీసుకుంటుంటాడు. మంత్రులను రాజీనామా చేయించడం కూడా జగన్ కు మేలే. ఇప్పుడు వారంతా తము తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకుంటూ కోర్టులో వాదనలు సాగించుకోవాల్సి వుంటుంది. ఆ నిర్ణయాలు సరైనవైతే, జగన్ నిర్థోషి కింద లెక్క. ఇలా తెలిసో, తెలియకో కిరణ్ నిర్ణయాలన్నీ జగన్ కు అనుకూలంగా వుండడం విశేషం.

Exit mobile version