కెజిఎఫ్ 2 నుండి షూటింగ్ అప్డేట్..

కేజీఎఫ్‌ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడగా, ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

తాజాగా చిత్ర‌యూనిట్ నుండి షూటింగ్ అప్డేట్ వచ్చింది. ఆగష్టు 26 నుండి బ్యాలెన్స్ షూట్ మొదలుకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మాస్ ఆడియెన్స్ అయితే ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. వచ్చే ఏడాది సినిమాని రిలీజ్‌ చేయ‌నున్నారు. హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది.