బ్లేడు బాబ్జీతో వినోదాన్ని పంచిన జోడీ.. నరేష్-దేవి ప్రసాద్. ఈ కాంబినేషన్ మరోసారి కితకితలు పెట్టడానికి సిద్ధమవుతోంది. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కెవ్వుకేక. దేవి ప్రసాద్ దర్శకుడు. బొప్పన చంద్రశేఖర్ నిర్మాత. షర్మిలా మాండ్రే కథానాయిక. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు. గబ్బర్ సింగ్‌లోని హిట్ సాంగ్ కెవ్వుకేక. ఆ పాట ఎంత హుషారుగా ఉంటుందో మా సినిమా కూడా అంతే సందడిగా ఉంటుంది. ప్రతి సన్నివేశం… కెవ్వుకేక పుట్టిస్తుంది. నరేష్ టైమింగ్, ఆయన పలికే సంభాషణలు ఈ సినిమాకి ప్రధాన బలం.. అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. జులై చివరి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.