కరోనా వైరస్ కారణంగా గత నాల్గు నెలలుగా షూటింగ్ లకు బ్రేక్ వేసిన కేంద్రం..తాజాగా మార్గదర్శకాలతో షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చని కేంద్ర సమాచార, ప్రచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
మార్గదర్శకాలు చూస్తే..
- కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్‌లో పాల్గొనాలి.
- చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి.
- ఆరోగ్య సేతు యాప్‌ని నటీనటులంతా వినియోగించాలి.
- షూటింగ్ సమయంలో విజిటర్లకు అనుమతి ఇవ్వద్దు.
- మేకప్ సిబ్బంది ఖచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
- తక్కువ సిబ్బందితో షూటింగ్లో చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.
- పరిశ్రమలో హైరిస్క్ కలిగినవారు అదనంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఫేస్ మాస్కులు, షీల్డులు పని ప్రదేశాలు, షూటింగ్ ప్రదేశాల్లో తప్పనిసరి.
- వీలైనంత వరకు ఆరు అడుగుల మేర దూరాన్ని పాటించాలి.
- తక్కువ సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చర్యలు తీసుకోవాలి.
- స్టూడియోల్లో వేర్వేరు యూనిట్లకు వేర్వేరు సమయాలు కేటాయించాలి
- ఎంటెన్స్, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఉండాలి.
- సెట్లు, మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్లు, టాయిలెట్లను తరచుగా శానిటైజ్ చేయాలి.
- గ్లౌజులు, మాస్కులు, పీపీఈలు అందుబాటులో ఉంచుకోవాలి
- షూటింగ్ వస్త్రాలు, విగ్గులు, మేకప్ మెటీరియల్ ఇతరులతో పంచుకోకుండా చూడాలి.
- కెమెరాలు, పరికరాలను ఒకరికంటే ఎక్కువ ఉపయోగిస్తే.. కచ్చితంగా సిబ్బంది గ్లౌజులు ధరించాలి.
- లేపల్ మైకులను దూరం పెట్టాలి. లేకుంటే వాడకం వీలైనంతగా తగ్గించాలి.
- సినిమా థియేటర్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ కాకుండా చర్యలు చేపట్టాలి.
- లోపలికి ప్రవేశించే మార్గాల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి.
- కొవిడ్ జాగ్రత్తలు తెలిపే పోస్టర్లు, సందేశాలు ఏర్పాటు చేయాలి.
- థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలి.
- టికెట్ల అమ్మకాల్లో ముట్టుకోవాల్సిన పని లేకుండా ఆన్లైన్ బుకింగ్స్, ఈ-వాలెట్లు, క్యూఆర్ కోడ్ స్కానర్లు వినియోగించాలి.
- తరచుగా పని ప్రదేశాలను శానిటైజ్ చేస్తూ ఉండాలి.
- అనుమానిత కేసులు ఉంటే సెల్ప్ ఐసోలేషన్ ఉండాలి.