సినిమా షూటింగ్ లకు కేంద్రం మార్గదర్శకాలు ..

కరోనా వైరస్ కారణంగా గత నాల్గు నెలలుగా షూటింగ్ లకు బ్రేక్ వేసిన కేంద్రం..తాజాగా మార్గదర్శకాలతో షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చని కేంద్ర సమాచార, ప్రచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు.

మార్గదర్శకాలు చూస్తే..

  • కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్‌లో పాల్గొనాలి.
  • చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలి.
  • ఆరోగ్య సేతు యాప్‌ని నటీనటులంతా వినియోగించాలి.
  • షూటింగ్ సమయంలో విజిటర్లకు అనుమతి ఇవ్వద్దు.
  • మేకప్ సిబ్బంది ఖచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
  • తక్కువ సిబ్బందితో షూటింగ్‌లో చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.
  • పరిశ్రమలో హైరిస్క్ కలిగినవారు అదనంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఫేస్ మాస్కులు, షీల్డులు పని ప్రదేశాలు, షూటింగ్ ప్రదేశాల్లో తప్పనిసరి.
  • వీలైనంత వరకు ఆరు అడుగుల మేర దూరాన్ని పాటించాలి.
  • తక్కువ సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చర్యలు తీసుకోవాలి.
  • స్టూడియోల్లో వేర్వేరు యూనిట్లకు వేర్వేరు సమయాలు కేటాయించాలి
  • ఎంటెన్స్‌, ఎగ్జిట్‌ మార్గాలు వేర్వేరుగా ఉండాలి.
  • సెట్లు, మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్లు, టాయిలెట్లను తరచుగా శానిటైజ్ చేయాలి.
  • గ్లౌజులు, మాస్కులు, పీపీఈలు అందుబాటులో ఉంచుకోవాలి
  • షూటింగ్ వస్త్రాలు, విగ్గులు, మేకప్ మెటీరియల్ ఇతరులతో పంచుకోకుండా చూడాలి.
  • కెమెరాలు, పరికరాలను ఒకరికంటే ఎక్కువ ఉపయోగిస్తే.. కచ్చితంగా సిబ్బంది గ్లౌజులు ధరించాలి.
  • లేపల్ మైకులను దూరం పెట్టాలి. లేకుంటే వాడకం వీలైనంతగా తగ్గించాలి.
  • సినిమా థియేటర్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ కాకుండా చర్యలు చేపట్టాలి.
  • లోపలికి ప్రవేశించే మార్గాల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి.
  • కొవిడ్ జాగ్రత్తలు తెలిపే పోస్టర్లు, సందేశాలు ఏర్పాటు చేయాలి.
  • థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలి.
  • టికెట్ల అమ్మకాల్లో ముట్టుకోవాల్సిన పని లేకుండా ఆన్‌లైన్ బుకింగ్స్, ఈ-వాలెట్లు, క్యూఆర్‌ కోడ్ స్కానర్లు వినియోగించాలి.
  • తరచుగా పని ప్రదేశాలను శానిటైజ్ చేస్తూ ఉండాలి.
  • అనుమానిత కేసులు ఉంటే సెల్ప్‌ ఐసోలేషన్‌ ఉండాలి.