రెండేళ్ల పాటు కేదార్‌ నాథ్‌ యాత్ర రద్దు

utharakhandఉత్తరాఖండ్ వరద భీభత్సంతో.. మరో రెండు సంవత్సరాల పాటు కేదార్‌నాథ్‌ యాత్ర రద్దు కానుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బహుగుణ ఈరోజు (శనివారం) ఉదయం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 556 మృతదేహాలను శిథిలాల కింద నుంచి వెలికితీసినట్లు వెల్లడించారు. ఇంకా చాలా మృతదేహాలు శిథిలాలకింద ఉన్నాయని, వరద ప్రాంతంలోని ప్రజలందరిని తరలించేందుకు మరో 15 రోజుల సమయం పడుతొందని ఆయన తెలిపారు. ఇంతటి విపత్తు హిమాలయాల చరిత్రలో ఎప్పుడూలేదని, కేదార్‌ నాథ్‌ ను పునర్‌ నిర్మించాలంటే చాలా రోజులు పడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో.. కేదార్‌ నాథ్‌ యాత్రను రెండేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు బహుగుణ ప్రకటించారు. అయితే, తమకు భారీవర్షాలపై సరైన సమాచారం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర మట్టానికి 40వేల చదరపుకిలోమీటర్ల ఎత్తులో ఈ విపత్తు సంభవించిందని సీఎం బహుగుణ తెలిపారు.