కేసీఆర్ తర్వాత ’కేకే’ నే..!

kcr-kesava-raoతెలంగాణ రాష్ట్ర సమితిలో నెంబర్-2 గొడవకు బ్రేకపడిందా..? అంటే అవుననే తెలుస్తోంది. తెరాస అధినేత కేసీఆర్ తర్వాత ఎవరంటే.. ఇన్నాళ్లు.. తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, కూతురు కవిత అనే కుటుంబ పేర్లు మాత్రమే వినవచ్చేవి. అయితే, తాజాగా తెరాసలో తన తర్వాత స్థానం ’కేకే’ దే అని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెరాస జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్ గా కేకే ఈరోజు (మంగళవారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. తెరాసలో అధ్యక్షుడి స్థానం తర్వాత స్థానం ‘కేకే’దన్నారు. కేకే సుదీర్ఘ రాజకీయ అనుభవం తెరాసకు ఉపయోగపడుతుందని, జాతీయ స్థాయిలో ఆయన చక్రం తిప్పునున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే, “ఛలో అసెంబ్లీ” అనంతరం తెలంగాణ బంద్ పై తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఆరోజు తెలంగాణ బంద్ కు పిలుపునివ్వడం తమ పార్టీ నిర్ణయమని, అలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం తమ పార్టీకి ఉందని కేసీఆర్ అన్నారు.

ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెరాసలోకి జంప్ అయిన ’కేకే’కు తెరాస సముచితస్థానం కల్పించడంతో పాటుగా.. పార్టీలో నెంబర్-2గా పేర్కొంది. దీంతో.. ఫ్యామిలీ మెంబర్స్.. నెంబర్-2 పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి !