Site icon TeluguMirchi.com

క‌త్రినా కైఫ్ తన గొప్ప మనసు చాటుకుంది..

బాలీవుడ్ భామ క‌త్రినా కైఫ్ తన గొప్ప మనసు చాటుకుంది. గత నాల్గు నెలలుగా షూటింగ్ లు బంద్ కావడంతో చిత్రసీమ నే నమ్ముకున్న కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావు. కనీసం తినడానికి తిండి కూడా లేక అలమటిస్తున్నారు. ఈ క్రమంలో క‌త్రినా కైఫ్ వందమంది డాన్సర్లకు సాయం చేసింది. క‌రోనా లాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో డ్యాన్స‌ర్‌కి పూట గ‌డ‌వ‌డం క‌ష్టంగా మారింది. ఈ ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న క‌త్రినా కైఫ్ 100 మంది నేపథ్య నృత్యకారులకు ద్రవ్య సహాయం అందించారు.

దీంతో కొంద‌రు టిఫిన్ సెంట‌ర్స్‌, కూర‌గాయ‌ల మార్కెట్స్ పెట్టుకోవ‌డానికి డ‌బ్బు ఉప‌యోగించారు. ఓ సీనియ‌ర్ న‌ర్త‌కి మాట్లాడుతూ..ప్ర‌తిరోజు ఉద‌యం ఎపిఎంఎస్ మార్కెట్‌లో కూరగాయలు కొని ప‌రిస‌ర ప్రాంతాల‌లో అమ్మేందుకు వెళ్తాను అమ్మేందుకు వెళ‌తాను చెప్పుకొచ్చింది.

Exit mobile version