జగన్ కు ‘కత్తి’ పోటు..

కత్తి మహేష్ ఈ పేరు ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సినీ విశ్లేషకుడుగా పరిచయమైన ఈయన..ఆ తర్వాత సినీ , రాజకీయ వ్యక్తలను టార్గెట్ చేసి కాస్త ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ లో చోటు దక్కించుకొని తాను ఓ సెలబ్రెటీగా మారాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాకా..పవన్ కళ్యాణ్ ఫై , అయన అభిమానులపై కామెంట్స్ చేస్తూ ఎంత ఫేమస్ అయ్యాడో అంత అయ్యాడు.

ఇక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఫై విమర్శలు చేసి..వైస్సార్సీపీ పార్టీ కి మద్దతు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచేందుకు జగన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆయన పాపులర్ కావడం కోసం ఇలా మాట్లాడుతున్నాడా..లేక ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావట్లే..మరి మహేష్ కామెంట్స్ ఫై వైసీపీ కార్య కర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి.