Site icon TeluguMirchi.com

మరోసారి కత్తి మహేష్ ను లోపలి నెట్టారు..

కత్తి మహేష్..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే ఆయన్ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేసారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టడంతో గత కొద్దిరోజుల క్రిందటే కత్తి మహేష్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘రాముడు కరోనా ప్రియుడు’ అని పోస్ట్ పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

వీటిపై స్పందించిన పోలీసులు కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్ 154 కమ్యూనల్ యాక్ట్ ‌కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అప్పటి నుంచి జైల్లోనే ఉన్న కత్తి మహేష్‌‌ను తాజాగా పీటీ వారెంట్‌పై మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version