కమల్, రజనీ సినిమా ఉంటుందా?

కమల్ హసన్, రజనీకాంత్… ఇద్దరూ మరోసారి జతకట్టనున్నారా? వీరిద్దరూ ఒకేసారి వెండితెరపై సందడి చేయడానికి వేదిక సిద్ధం అవుతుందా? ప్రస్తుతం ఈ చర్చ చిత్రసీమలో హాట్ టాపిక్. ఈ అల్ టైం గ్రేట్ కదానాయకులిద్దరినీ ఒకే తెరపై  చూడాలని… తమిళ సినీ అభిమానులు ఎప్పటినుంచో ఆశ పడుతున్నారు. కే.బాలచందర్ దర్సకత్వంలో వీరిద్దరూ నటిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో దర్శకుడు వీరితో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఆయనే… భాగ్యరాజా. ఇటీవల ఈ దర్శక దిగ్గజం తన మనసులోని మాట బయటపెట్టారు. “కమల్, రజినీ వీరిద్దరి సినిమాతోనే నా ప్రయాణం మొదలయ్యింది. మరోసారి వీరితో పనిచేయాలని వుంది. ఆ అవకాసం ఇస్తే…. నేను పారితోషికం కూడా తీసుకొను” అని చెప్పారు. మరి కమల్, రజినీ అందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి.