రాష్ర్టంలో ఉద్యోగాల జాతర.. !

appsc jobs in apనిరుద్యోగులకు శుభవార్త ! రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతిని మంజూరు చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 33,738 ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు గాను ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల మండలి, జిల్లా స్థాయి ఎంపిక కమిటీ(డీఎస్ సీ) లు ఈ ఉద్యోగాల భర్తీని చేపడతాయి. మొత్తం 34 శాఖల్లోని గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4తో పాటుగా ఇతర గెజిటెడ్, నాన్ గెజిటెడ్, సాంకేతిక వర్గీకరణల్లోని ఉద్యోగాలు ఉన్నాయి. త్వరలోనే ఆయా శాఖల ద్వారా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.