Site icon TeluguMirchi.com

జగన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా షర్మిల ?

ys sharmilaఆదినుంచీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉండటమే కాక ” మరో ప్రజా ప్రస్తానం ” పేరిట 3000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టిన షర్మిల కు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాను కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. జైలులో వున్న ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ మేరకు నిర్ణయం గైకోన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ‘ వస్తున్నా మీకోసం ‘ అనే పేరుతో పాదయాత్ర ప్రారంభించటం, మరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట పేరుతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించటం లాంటివి చేస్తుంటే ఆ రెండు పార్టీలకు ఎక్కడ మైలేజి వస్తుందో నన్న ఆందోళన తో జగన్ ఆదేశం మేరకు షర్మిల ఈ పాదయాత్ర మొదలెట్టారు. వయోపరంగా పాదయాత్ర చేసేందుకు విజయమ్మ కు కష్టం కావటం కారణం గానూ, షర్మిల స్పీకర్ కాకపోవటం తోనూ ఈ యాత్ర బాధ్యతను జగన్ షర్మిల భుజాన పెట్టారు. 3000 కిలోమీటర్లు నడవాల్సిన బాధ్యతను భుజాన వేసుకున్న షర్మిల గత 15 రోజులుగా నిరాటంకంగా యాత్రను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు యాత్ర ఇప్పటికే 40 రోజులు దాటింది. ఊరూరా ఆయనకు జనం బ్రహ్మరధం పడుతున్నారు. మారిన తన వైఖరితో బాబు కూడా జనంలోకి చొచ్చుకు పోతున్నారు వాళ్ళ సమస్యలు వింటున్నారు… తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు… అనేక వరాలు, ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు. యాత్రకు బయలుదేరే ముందు బి.సి. డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, ఎస్.సి.వర్గీకరణ లాంటివి ప్రకటించిన చంద్రబాబు ఆదివారం నాడు గిరిజన డిక్లరేషన్ కూడా ప్రకటించారు. చంద్రబాబు యాత్ర , ఆయన ప్రకటనలు వ్యూహాత్మకంగా, రాజకీయ ప్రయోజనాత్మకంగా సాగుతుండగా , షర్మిల యాత్ర మాత్రం చంద్రబాబు మీద దండయాత్ర లా సాగుతోంది.ఆమె ఎక్కడా పధకాల గురించి గాని, ప్రభుత్వ వైఫల్యాల మీద నిర్మాణాత్మకం గా గాని మాట్లాడకుండా 40 శాతం కిరణ్ సర్కారు మీద , 60 శాతం చంద్రబాబు మీద కేంద్రికరింపబడి సాగుతున్నాయి. ఈ యాత్ర  సర్కారు కు వ్యతిరేకంగానా, లేక చంద్రబాబు కు వ్యతిరేకంగా నా అన్న అనుమానం కూడా రేగుతోంది.

వాస్తవానికి జగన్ లేని సమయంలో పార్టీ బాధ్యతలను షర్మిల కు వప్పగించటం ఆ పార్టీ లోనే చాలామందికి ఇష్టం లేదని తెలిసింది. ఆమె స్లోగా చాప కింద నీరులా పాకి ఏకు మేకు లా మారిపోతుందని పలువురు పార్టీ పెద్దలు భయపడుతున్నారు. జగన్ బైటికోచ్చే సరికి ఆమె పార్టి లో బాగా వేళ్లూనుకు పోతుందని, ఏకు మేకు అవుతుందని వారు కలవర పడుతున్నారు. ఇప్పటికే నిదానంగా షర్మిల పార్టీ లో తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారని మరి కొన్నాళ్ళు ఆగితే ఆమె తన పట్టును మరింత బిగదీస్థారని జగన్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడొకరు చెప్పారు. పాదయాత్ర లో జనాన్ని సమికరించటం లో గానీ, ప్లాన్ ప్రకారం యాత్రను నిర్వహించటం లో గానీ జగన్ పార్టి నాయకులు సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. అయితే ఇప్పటికే దాకా షర్మిల పార్టిలో పదవంటూ ఏది లేదు.. కేవలం జగన్ సోదరిగానే ఆమె కొనసాగుతున్నారు.. ఈ నేపధ్యంలో ఆమెకు పార్టీ లో కీలకమైన బాధ్యతలు వప్పగిస్తే నైతికంగా షర్మిల కు బలం చేకూర్చినట్లవుతుందని , ఆమెకు మరింత పట్టు పార్టీ లో లభిస్తుందని జగన్ ఆలోచిస్తున్నట్టు భోగట్టా… ఈ దశ షర్మిలకు పార్టీ  సెక్రటరీ జనరల్ పోస్టు ఇస్తార  లేక జనరల్ సెక్రటరి పోస్టు ఇస్తారా అన్నది వేచి చూడాల్సివుంది ….!

Exit mobile version