జగన్ సభ చివరిలో ఒక అభిమాని , సరదాకే కావచ్చు కానీ ..” ఆ నాలుగో సింహం ఎక్కడ’ అని అడగడం బహుశా ఈ సభ జరిగిన విధానాన్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుందేమో!! సాయికుమార్ సినిమా లోని ఆ ‘నాలుగో సింహమే పోలీసు రా’ అనే డైలాగ్ బాగా అలవాటైన ప్రజలకి ఈ మాత్రం అనుమానం రావడం లో తప్పేమీ లేదు. “ఆ ముగ్గిరినీ” అడగదల్చుకొన్నా, అడగదల్చుకొన్నా, అడగదల్చుకొన్నా, అంటూ జగన్ తన సభలో చాలా సార్లు చెప్పారు. ఆ ముగ్గురూ సోనియా, కిరణ్ చంద్ర బాబు లని చెప్పిన జగన్ అసలు కేసీఆర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం , టీ వీలు చూస్తున్న ప్రజలకే కాదు సభలో వున్న కార్యకర్తలకి కూడా అర్ధం కాలేదు.
రాష్ట్రంలో వున్నవి నాలుగు పార్టీలు కదా, అంత ముఖ్యమైన కె సీ ఆర్ గురించి అస్సలు మాట్లాడకుండా, ఆ నాలుగో సింహం ఎక్కడుందీ, అనే విషయం మరచిపోయ్యారో, లేదా ఇది ఇంకో డీల్ లో బాగమో ప్రజలకైతే అర్ధం కాలేదు. ఇంత కాలం కాంగ్రెస్ తో మాత్రమే డీల్ అనుకొన్న ప్రజలు, ‘డీల్ స్టోరీ’ లో ఈ ‘కేసేఆర్ – జగన్’ట్విస్ట్ ఏంటిరా బాబూ అంటూ తలలు పట్టుకొన్నారు.!!
కానీ మొత్తం మీద హైదరాబాదు లో రాష్ట్ర విభజన గురించి పెట్టిన సభలో, సమైక్యాంధ్ర కోసం పెట్టిన సభలో, అసలు కేసీఆర్ గురించి కానీ, టీ ఆర్ యెస్ గురించి కానీ మాట్లాడకుండానే సభను ముగించిన జగన్ ను చూసి అతని అభిమానులు ఏమో కానీ ఇతరులకి మాత్రం ఈ రాజకీయం ఏమిటో అర్ధం కాలేదు. నిన్న మొన్ననే కేసీఆర్ కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి సీమాంద్రులని, వారి నాయకులని, హైదరాబాదు విషయమై మాట్లాడిన పక్క రోజే, సమైక్యాంధ్ర కోసం జగన్ పెట్టిన సభలో అసలు టీ ఆర్ యెస్ ని ప్రస్తావించకపోవడం , ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగదే అని ప్రజలకు స్పష్టమైంది!!