లాక్ డౌన్ తో గత మూడు నెలలుగా షూటింగ్ లు బంద్ కావడం తో చిత్రకు సీమా కోలుకోలేని దెబ్బ తగిలింది. తాజాగా కేంద్రం ప్రకటించిన సడలింపుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇవ్వగా..ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసి అనుమతి ని అడగనున్నారు.
మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి సినీ ప్రముఖులు..మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో షూటింగ్లకు సింగిల్ విండో అనుమతి ఇవ్వడంపై సీఎం జగన్కు ధన్యవాదాలు తెలపనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం టాలీవుడ్లోని సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, సురేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి, సి.కళ్యాణ్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.