4వ తేదీకి వాయిదా పడ్డ జగన్‌ బెయిల్‌ విచారణ

కడప ఎంపీ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు గా చంచల్‌ గూడ జైలులో రిమాండ్‌ లో ఉన్నారు. కాగా, తనకు బెయిలు ఇవ్వాలంటూ కోర్టులో పిటీషన్‌ లు దాఖలు చేస్తూ ఉన్నప్పటికీ ప్రతీసారీ జగన్‌ కు చుక్కెదురు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి, బెయిల్ పిటిషన్‌ పై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి డిసెంబర్ 4కు తదుపరి విచారణను వాయిదా వేశారు. సీబీఐ తరపున లాయర్లు కేసు విచారణలో ఉన్న ఈ దశలో జగన్‌కు బెయిల్ ఇవ్వరాదని వాదించగా, జగన్ తరపు న్యాయవాదులు జగన్ ఒక పార్టీకి అధినేత అని, ఆయనకు పార్టీ కార్యక్రమాలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని వాదించారు.