జైపాల్ రెడ్డి పార్టీ వీడుతున్నారా…?

damodhar-reddyతెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రంపై మాటల యుద్ధం తీవ్రతరం చేశారు. తెలంగాణపై తేల్చకుంటే ఆ ప్రాంతంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిసహా రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సారయ్య తదితరులు పార్టీని వీడే అవకాశం ఉందని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత శానససభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి  అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని, తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉందని ఆయన అన్నారు. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి శనివారం అసెంబ్లీ సాక్షిగా హైకమాండ్ కు గట్టి హెచ్చరిక లాంటి ప్రకటనలు చేశారు. ప్రస్థుత పరిస్థితుల్లో రాజకీయంగానే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణవాదం వినిపించే పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. తెలంగాణపై తేల్చకుంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పని ఖతమైతుందని హెచ్చరించారు. డిసెంబర్ 9వ తేదీ లోగా ఓ ప్రకటన వస్తుందని భావిస్తున్నామన్నారు. పిసిసి అధ్యక్ష పదవి కోసం రాజ్యసభ సభ్యుడు కెవిపి ప్రయత్నిస్తున్నారని, కెవిపి పిసిసి అధ్యక్షుడైతే  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సులువు అవుతుందని ఆయన అన్నారు.