Site icon TeluguMirchi.com

హేడ్లీని మాకప్పగించండి!

Headleyముంబై పేలుళ్ల కీలక నిందితుడు డేవిడ్ హేడ్లీని విచారణ నిమిత్తం ఒక్క ఏడాది అప్పగించాలని అమెరికాను భారత్ కోరింది. ఒక దేశం నుంచి మరో దేశానికి ఖైదీల బదిలీ సాధ్యం కాదని అమెరికా తేల్చి చెప్పినా భారత్ తమకు తాత్కాలికంగా ఒక్క ఏడాదికి మాత్రమే అప్పగించాలని కోరింది. విచారణ పూర్తి చేసుకుని తరువాత అప్పగిస్తామని పేర్కొంది. అయితే ఆ విజ్ఞప్తికి అమెరికా అంగీకరించే అవకాశం ఉందని భారత దౌత్యవేత్తల నమ్మకం. హేడ్లీ విచారణ పూర్తిచేసుకుంటే ఈ పేలుళ్ల వెనుక ఎవరెవరున్నది బయటపడే అవకాశం ఉంది. దీనికి తోడు పాకిస్తాన్ ను అంతర్జాతీయ ముద్దాయిగా నిలబెట్టవచ్చు అన్నది భారత్ ఆలోచన. దీనికి హేడ్లీ విచారణ సరిపోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Exit mobile version