Site icon TeluguMirchi.com

మితిమీరిన నిరాశవాదమే అభివృద్ధికి ఆటంకం : ప్రధాని

ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఫీక్కీ సదస్సుకు ప్రధాని ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో ఆర్థిక అసమానతలు రాత్రికి రాత్రే తొలగించడం అసాధ్యమని తెలిపారు. మితిమీరిన నిరాశవాదమే అభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు. భారత ఆర్థిక పరిస్థితి 2008లో మెరుగ్గానే ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్ల మందగమనం మన దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని అన్నారు. అమెరికా, చైనాల ఆర్థిక వృద్ధిరేటు ఇంకా మందగమనంలోనే ఉందని చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

 

Exit mobile version