బన్ని.. ఇద్దరమ్మాయిలూ.. బ్యాంకాక్

పూరి జగన్నాధ్ కీ, బ్యాంకాక్ కీ అవినాభావ సంబంధం వుంది. పూరి కధా చర్చల కోసం బ్యాంకాక్ వెళ్తారు. పాటల కోసం ట్యూన్స్ కుడా అక్కడే వింటారు. తన సినిమా కధ కుడా అటు తిరిగి ఇటు తిరిగి బ్యాంకాక్ వెళ్తుంది. పూరికి బ్యాంకాక్ ఓ సెంటిమెంట్ గా మారింది. ఇప్పుడు తన కొత్త సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’ కుడా అక్కడే శ్రీకారం చుట్టబోతున్నారు. అల్లు అర్జున్ కధానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. అమలాపాల్ , కేధరిన్ కధానాయికలు. బండ్ల గణేష్ నిర్మాత. ఈనెల 19 నుంచి బ్యాంకాక్ లో చిత్రీకరణ ప్రారంభిస్తారు. ఎక్కువభాగం బ్యాంకాక్, స్విర్జర్లాండ్ లలో చిత్రీకరిస్తారు. చాలాకాలం తరవార పూరి రూపొందిస్తున్న రొమాంటిక్ లవ్ స్టొరీ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట కంపోజ్ చేసారట. అది యమ సూపర్ గా వచ్చిందని పూరి ఖుషీ అయిపోతున్నారు.