బొగ్గుల పులిని కాదు.. బొబ్బిలి పులినే : దాసరి

dasari narayanaro cbiమాజీ కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు తన హయాంలో జరిగిన బొగ్గు కేటాయింపుల అక్రమాలపై స్పందించారు. ఈరోజు (బుధవారం) దాసరి విలేకరులతో మాట్లాడుతూ..  “నేను బొగ్గుల పులిని కాదు… బొబ్బిలి పులినే… ఒక పథకం ప్రకారం నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి. అభిమానులు ఆందోళన చెందవద్ద” ని అన్నారు. దాసరి యూపీఏ-1 హయాంలో బొగ్గు గనుల శాఖా సహాయమంత్రిగా ఉండగా.. జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి లబ్ది చేకూర్చాంటూ సీబీఐ నిన్న (మంగళవారం) ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాసరి చేసిన మేలుకు ప్రతిఫలంగా ఆయనకు చెందిన సౌజన్య మీడియాలోకి 2.25కోట్ల నిధులు వచ్చాయంటూ అభియోగాలను మోపింది. దీనిలో భాగంగానే నిన్న దాసరి నివాసం, ఆయన బంధువుల నివాసలతో పాటుగా, ఆయన ఆఫీసులలో సీబీఐ సోదాలు చేసిన విషయం విదితమే.