Site icon TeluguMirchi.com

గ్రేటర్‌లో కరోనా మహమ్మారి విజృభిస్తూనే ఉంది ..

కరోనా మహమ్మారి మహానగరాన్ని వదిలిపెట్టడం లేదు. రోజు రోజుకు గ్రేటర్ పరిధిలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం మరో 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం అత్యధికంగా 122 కేసులు నమోదు కాగా, సోమవారం 79 నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు తర్వాత కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం నగరవాసులను కలవరపెడుతోంది.

కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో సోమవారం 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. అలాగే నగరంలో పలు ఏరియాల్లో పలు కేసులు నమోదు అయ్యాయి.

Exit mobile version