Site icon TeluguMirchi.com

హోం మంత్రిగా గీతారెడ్డి..!

geethareddyరాష్ట్ర హోంశాఖ మంత్రిగా గీతారెడ్డిని నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నిజేమనండీ.. కాకపోతే షరతులు వర్తిస్తాయన్న మాట. రెండో దఫా అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ.. పూర్తి బాధ్యతలు కాకుండా.. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గీతారెడ్డికి హోంశాఖ అదనపు బాధ్యతలు కేటాయించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ఇటీవలే ధర్మాన, సభితా ఇంద్రారెడ్డిలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, రోడ్లు భవనాల శాఖ అదనపు బాధ్యతలను పితాని సత్యనారాయణకు అప్పగించారు. సభలో ప్రతిపక్షాలు ఆయా
శాఖలపై ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మంత్రులుండాలని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version