Site icon TeluguMirchi.com

హైదరాబాద్ లో హైఅలర్ట్ !

Charminarతెలంగాణ రాజకీయ జేఏసీ ఈ రోజు తలపెట్టిన “ఛలో అసెంబ్లీ” నేపథ్యంలో.. పోలీసులు నగరంలోపై డేగ కన్ను వేశారు. ముఖ్యంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో చీమ కూడా ప్రవేశించకుండా గట్టి బందోబస్తు చేశారు. దాంతో పాటుగా ఉస్మానియా యూనివర్ సిటీ తదితర ప్రాంతాల్లో పోలీసులు పహారా కాశారు. మరోవైపు తెలంగాణ వాదులు కూడా ఎట్టి పరిస్థితుల్లో “ఛలో అసెంబ్లీ”ని నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే.. టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు పోలీసుల కళ్లుగప్పి  నాంపల్లి తెలుగు యూనివర్శిటీ దగ్గర అసెంబ్లీ వైపుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడుగడుగునా నిర్బంధం ఉన్నా తెలంగాణ వాదులు దూసుకురావటంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తేరుకుని వెంటనే ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు.

అంతేకాకుండా,  ఇందిరాపార్క్‌ సెంటర్‌గా తెలంగాణ జేఏసీ నేతలు “ఛలో అసెంబ్లీ”కి సిద్ధం అవుతున్నారు. ఇలా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన తెలంగాణ వాదులు ఏ గల్లి నుంచి సాధ్యమయితే.. ఆ గల్లీ నుంచి అసెంబ్లీని ముట్టడిద్దామని ప్రయత్నిస్తున్నారు. అయితే, పోలీసులు కూడా గల్లీ-గల్లీ గస్తీ కడుతూ.. ఆందోళన కారులను తెలంగాణ వాదులను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. నగరంలో ఓ రకమైన యుద్ద వాతావరణం నెలకొన్నట్లు గా కనిపిస్తోంది. “ఛలో అసెంబ్లీ” నేపథ్యంలో.. రాష్త్రంలో అన్ని పాఠశాల, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

Exit mobile version