Site icon TeluguMirchi.com

హ‌లో బ్రదర్ కి అంతా సిద్ధం!

18205639త‌డాఖా హిట్‌తో జోష్‌మీద ఉన్నాడు నాగ‌చైత‌న్య. ఇప్పుడు అక్కినేని హీరోల మ‌నం సినిమా కోసం సిద్ధమ‌వుతున్నాడు. ఈ చిత్రం ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. మ‌రోవైపు శ్రీ‌నివాస‌రెడ్డి చిత్రం కూడా మొద‌లు కానుంది. ఇటీవ‌లే నాగ‌చైత‌న్య – శ్రీ‌నివాస‌రెడ్డి సినిమా పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. స్ర్రిప్టు ప‌నులు కూడా పూర్తయ్యాయి. మ‌నం ఒక‌వైపు ఈ సినిమా మ‌రో వైపు షూటింగ్ జ‌రుపుకోనుంది. హ‌లో బ్రద‌ర్ సినిమాకి స్ఫూర్తిగా తెర‌కెక్కుతున్న సినిమా ఇది. చైతూ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్నాడు. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశాలున్నాయి. జులై మొద‌టి వారం నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. సొ…రెండు సినిమాలో చైతూ ఫుల్ బిజీ అన్నమాట‌.

Exit mobile version