Site icon TeluguMirchi.com

కరుణించని వాతావరణం… డెహ్రడూన్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య బృందం

heavy-rains-at-badrinadhఉత్తరాఖండ్ లో ఆదివారం తీవ్ర వర్షం కురవడంతో రక్షణ చర్యలకు అడ్డంకి ఎదురయింది. దెబ్బతిన్న ప్రాంతాల్లోనే మళ్లీ భారీ వర్షం పడుతుండడంతో సహాయక చర్యలు ఆగిపోయాయి. ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్లు సహస్రధారకు తిరిగిరావాల్సి వచ్చింది. ఈ ఉదయం నుంచి పడుతున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు చాలా ఇబ్బంది కలుగుతోంది.

మరో వైపు చార్ ధామ్ యాత్రలో చిక్కుకుపోయిన బాధితులకు సేవలందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వైద్యులు డెహ్రడూన్ కు ఈ రోజు పయనమయ్యారు. ఈ వైద్యులు అక్కడ కీలకమైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు వైద్యసహాయం చేస్తారు. అలాగే తెదేపాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ నెల వేతనాన్ని ఉత్తరాఖండ్ సీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Exit mobile version