మెగా హీరోలు వాడుకుంటున్నారు.. !

allu-arjun-harish-shankar“గబ్బర్ సింగ్’తో పవర్ స్టార్ కి సూపర్ డూపర్ హిట్ అందించాడు యువ డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ మ్యానరిజమ్ ను తనదైన స్టయిల్ లో చూపించి..  పవర్ స్టార్ అభిమానులను మెప్పించగలిగాడు. పవన్ కి హిట్ అందించిన తరవాత మెగా హీరోల చూపు ఈ యువ డైరెక్టర్ పై పడింది. తాజాగా, హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి స్టయిల్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ చెప్పిన కథ బన్నికి బాగా నచ్చందని టాలీవుడ్ సమాచారమ్. ప్రస్తుత హరీష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “రామయ్య.. వస్తావయ్య” చేస్తున్నాడు. ఈ సినిమా ముగిసిన వెంటనే… బన్నితో సినిమా ప్రారంభం అవుతుందని టాక్. బన్నీ.. తరవాత ఈ డైరెక్టర్ ను వాడుకునేది చేర్రీనే కావవొచ్చేమో..!