విధ్వంసాలకు పాల్పడొద్దు : హరీష్

harish-rao“చలో అసెంబ్లీ” కార్యక్రమంలో ఎలాంటి విధ్వంసాలకు పాల్పడవద్దని తెరాస సీనియర్ నేత హరీష్ రావు తెలంగాణ వాదులకు సూచించారు. అసెంబ్లీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే ప్రజల ప్రాథమిక హక్కుని ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. అరెస్టయిన వారు అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహించమని ఆయన పేర్కొన్నారు. అనుమతి ఇచ్చివుంటే.. శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్లమని.. ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన నేపథ్యంలో.. తాజాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ప్రభుత్వానిదే
బాధ్యతని హరీష్‌ రావు అన్నారు. ఎన్ని బైండోవర్లు, ఎన్నికేసులు పెట్టినా తెలంగాణ వాదులు భయపడరని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ ఆరుగంటలకే అసెంబ్లీకి రావడాన్ని చూస్తే “చలో అసెంబ్లీ”
విజయవంతమైనట్టేనని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు చిత్తశుద్ది లేదని ఆయన విమర్శించారు.