కరోనా మహమ్మారి చిత్రసీమ ప్రముఖులను నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి రోజు ఎవరికో ఒకరికి ఈ కరోనా సోకుతుంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా వారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఈయన ఆరోగ్యం సీరియస్ గా ఉందని వైద్యులు చెపుతున్నారు. ఎస్పీ బాలుకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఎస్పీబీ ఉన్నారని హెల్త్ బులిటెన్‌లో ఎంజీఎం పేర్కొంది. కరోనా నుంచి ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని సంగీత ప్రియులూ గురువారం ప్రార్ధనలు చేయాలని తమిళ సినీ పెద్దలు కోరుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ”తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తన పాటలతో దశాబ్దాల కాలంగా సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేసిన లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడి.. తిరిగి అందరినీ అలరించారని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు హరీష్ రావు.
#SPBalasubrahmanyam
a legendary singer who has entertained music lovers for decades with his songs, has made his mark in Telugu, Tamil, Kannada, Hindi and other languages. I pray for his speedy recovery. pic.twitter.com/aSQF4LS9Gk— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) August 20, 2020