మూవీమొఘ‌ల్‌ హ్యాపీ బ‌ర్తడే!

Happy-Birthday-Ramanaiduనిర్మాత అంటే జ‌మా ఖ‌ర్చలు రాసుకొనే గుమ‌స్తా కాదు, డ‌బ్బులు పంచే మేనేజ‌ర్ కాదు – సినిమా చ‌క్రం తిప్పేది ఆయ‌నే అని నిరూపించ‌డానికి అప్పుడ‌ప్పుడూ కొంత‌మంది నిర్మాత‌లు వ‌స్తుంటారు! అలా వ‌చ్చి, నిలిచి, గెలిచి – మూవీమొఘ‌ల్‌గా పేర్గాంచిన నిర్మాత డి.రామానాయుడు. సినిమా అంటే ఆయ‌న‌కు వ్యాపారం కాదు. ఓ ఫ్యాష‌న్‌. క‌థ‌లో, సంగీతంలో, న‌టీన‌టుల ఎంపిక‌లో ఓ నిర్మాత జోక్యం చేసుకోగ‌లిగితే ఫ‌లితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో రామానాయుడు సినిమాలు చూస్తే తెలుస్తాయి. స్ర్కిప్టంతా బ‌ట్టీ ప‌ట్టి – ఎవ‌రి డైలాగ్ ఏమిటో, ఏ రోజు ఏ షాట్ తీయాలో చెప్పగ‌ల నేర్పరి ఆయ‌న‌. అందుకే రామానాయుడు అనే పేరు.. నిజ‌మైన నిర్మాత‌కు నిర్వచ‌నంలా మారింది. ఒక్క సినిమా తీస్తేనే.. ప్రపంచ యుద్ధాలు చేసినంత బిల్డప్పులిచ్చేస్తారే.., ఆయ‌న ఒక‌టి, యాభై, వంద‌… అంటూ సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇంకా తీస్తారు కూడా. రూపాయి నోటు మీద ఉన్న అని భాష‌ల్లోనూ సినిమాలు తీస్తా అని ప్రక‌టించి ఆ క‌ల సాకారం చేసుకొన్నారాయ‌న‌. ఇప్పటికీ ఆయ‌న‌లో త‌ప‌న త‌గ్గనే లేదు. ఆయ‌న ఆఫీసుకు వెళ్తే ఏదో ఓ క‌థ వింటూ కనిపిస్తూనే ఉంటారు. సార్‌.. మీరిలానే సినిమాలు తీయాలి. ఎంతోమంది సినీ కార్మికుల‌కు బ‌తుకు తెరువు చూపించాలి.. 150, 200 మైలురాళ్లనూ అందుకోవాల‌ని తెలుగు మిర్చి కోరుకొంటోంది. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..