జోరుపై వున్న నితిన్, నిత్యాల జోడి

Gunde Jaari Gallanthayyinde Movie Stills (10)నితిన్, నిత్య మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇష్క్’ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వరుస పరాజయాలతో సతమవుతున్న నితిన్ ఈ సినిమాతో మళ్లీ రైట్ ట్రాక్ మీద పడ్డాడు. నితిన్ కెరీర్ కు ‘ఇష్క్’ సినిమా ఆక్సిజన్ లా పని చేసింది. మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘గుండె జారి గల్లంతయిందే’ అనే సినిమా రాబోతుంది. ఇష్క్ సినిమాని నిర్మించిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం దాదాపుగా 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కొండ విజయ్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఆండ్రూ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.