Site icon TeluguMirchi.com

మాస్టర్ కోరిక తీర్చిన తమిళ్ సర్కార్

లాక్ డౌన్ కారణంగా దాదాపు 9 నెలలుగా మూతపడిన థియేటర్స్ ఈ మధ్యనే 50 % ఆక్యుపెన్సీ తో రీ ఓపెన్ అయ్యాయి. అయితే రీసెంట్ గా తమిళ్ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి ని కలిసి 100 % థియేటర్స్ఆక్యుపెన్సీ కి అనుమతి కోరారు. ఈ క్రమంలో తమిళనాడు సర్కారు తీపి కబురు అందించింది.

క‌రోనా క్ర‌మ‌క్ర‌మేపి త‌గ్గుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం వంద‌శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్ న‌డుపుకోవ‌చ్చ‌ని జీవో జారీ చేసింది. దీంతో యాజ‌మాన్యాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి. విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం జన‌వ‌రి 13న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో తమిళ‌నాడు ప్ర‌భుత్వం పాస్ చేసిన ఆర్డ‌ర్స్‌తో చిత్ర నిర్మాత‌లు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version