బ‌న్నీకి మంచి ఛాన్స్‌

allu-arjun-lingusamy (4)మ‌న హీరోలు మార్కెట్ పెంచుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్రయ‌త్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ ఎగ‌రివెళ్లడానికి ప్రయ‌త్నిస్తున్నారు. యూనివ‌ర్సల్ క‌థ‌ల‌ని ఎంచుకోవ‌డానికి ప్రయ‌త్నిస్తున్నారు. కానీ ప‌క్కన ఉన్న త‌మిళ సీమ‌ని మాత్రం మ‌ర్చిపోతున్నారు. అక్కడ హీరోలంతా తెలుగులో పాగా వేస్తుంటే, మ‌నం మాత్రం అటువైపుకి వెళ్లే ఆలోచ‌నే చేయ‌డం లేదు. ఇప్పుడిప్పుడే వారి ఆలోచ‌న‌ల్లో మార్పులు వ‌స్తున్నాయి. అల్లు అర్జున్ కి మ‌ల‌యాళంలో మాంచి ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమా తెలుగు, మ‌ల‌యాళం భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల అవుతోంది. ఇప్పుడు… త‌మిళంలోనూ జెండా ఎగ‌రేయ‌డానికి బ‌న్నీ ప్లాన్‌ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో.. అక్కడ ఓ సినిమా తీయాల‌నేది బన్నీ ఆలోచ‌న‌. ఇప్పుడు అది కార్యరూపం దాల్చుతోంది. బ‌న్నీ త్వర‌లో నేరుగా త‌మిళంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. లింగు స్వామి ద‌ర్శక‌త్వ వ‌హిస్తారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా ఒకేసారి షూటింగ్ జ‌రుపుకోనుంది. వ‌చ్చే నెల‌లో ఈసినిమాని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. లింగు స్వామికి త‌మిళంలో మంచి క్రేజ్ ఉంది. యాక్షన్ సినిమాల్ని బాగా తీస్తారాయ‌న‌. ఆయ‌న సినిమాతో త‌మిళంలో కాలు మోప‌డం.. బ‌న్నీకి క‌లిసొస్తుంది. త‌మిళంలోనూ త‌న స‌త్తా చూపించ‌డానికి బ‌న్నీకి ఇదే మంచి ఛాన్స్‌. మ‌రి… ఏం చేస్తాడో చూడాలి.