Site icon TeluguMirchi.com

సాకర్ ప్రపంచకప్ కు గ్రీన్ సిగ్నల్

U-17-World-Cup-Indiaప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఫుట్ బాల్ ప్రపంచకప్ పోటీలను మన దేశంలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అండర్-17 ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ ను మనదేశంలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టోర్నిని నిర్వహించేందుకు బిడ్ వేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. అండర్-17 ఫుట్ బాల్ ప్రపంచకప్ 2017ను తమ దేశంలో నిర్వహించేందుకు అనుమతివ్వాలని అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య(ఎఫ్ఐఎఫ్ఏ)ను ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) కోరనుందని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పోటీలతో భారతదేశంలో సాకర్ ను అభిమానించేవారి సంఖ్య రెట్టింపుకావచ్చని విశ్లేషకులు అంచనా.

Exit mobile version