కాంగ్రెస్‌ నేతలపై కేసులు నమోదు చేయాలి : రాఘవులు

వామపక్షాలు పెద్ద ఎత్తున విద్యుత్‌ భారాలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు శుక్రవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ… ఉద్యమ కారులు, ప్రజల నోరునొక్కేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం బషీర్‌బాగ్‌ ఉద్యమ కేసులను సిఐడి చేత తిరగతోడిస్తోందని విమర్శిం చారు. అవసరమైతే వామపక్షాలు ప్రజలకోసం జైలుకెళ్లేం దుకు, ప్రాణాలనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. ఆనాడు ఉద్యమంలో పాలుపంచుకున్నామని చెప్పు కుంటున్న కాంగ్రెస్‌ నేతలపై ముందుగా కేసులు నమోదు చేయాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను విద్యుత్‌ రంగం ద్వారా కొల్లగొట్టేందుకు పూనుకుందని విమర్శించారు. తాము ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని గుర్తుచేశారు. అప్పుడు ఈ అంశం అందరికీ అంతలా అర్థం కాకపోయినా ఇప్పుడు వస్తున్న కరెంటు బిల్లులు చూసిన వారికి ఛార్జీలు, ఎఫ్‌ఎస్‌ఎల రూపంలో ప్రభుత్వం తమపై ఎంత పెద్ద మొత్తంలో భారాలు మోపిందనే విషయం అర్థమవుతోంద న్నారు. ఈ భారాలను చూసిన ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారని చెప్పారు బి.వి.రాఘవులు.