2013 లో అంతకు ముందు ఆ తర్వాత అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఈ భామ , ఆ తర్వాత బందిపోటు , అవే వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా తలుపు తట్టలేదు. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత తర్వాత తన జాతకం మారుతుందని ఆశ పడింది కానీ అది జరగలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాతో కాలం గడుపుతుండగా..హ్యాకర్స్ అది కూడా చేసుకోనివ్వలేదు.
రీసెంట్గా తన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా , అకౌంట్ లేదు అని చూపిస్తుందట. దీంతో తన అకౌంట్ హ్యాక్‌కి గురైనట్టు భావించింది. ఈషా టెక్నికల్ టీం అకౌంట్ ను మళ్లీ తమ పరిధిలోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ సాధించారు. కొద్ది సేపటి క్రితం ఈషా రెబ్బా అకౌంట్ తిరిగి అందుబాటులోకి రాగా, ఈ విషయాన్ని ఈషా తన ట్విట్టర్లో చెప్పుకొచ్చింది. హలో ఫ్రెండ్స్ .. నా ట్విట్టర్ హ్యాండిల్‌కు సెల్ఫ్ క్వారంటైన్ పూర్తైంది. ఇప్పుడు సేఫ్, సెక్యూర్‌గా ఉంది. నా అకౌంట్‌ని తిరిగి తీసుకొచ్చిన టీంకి ధన్యవాదాలు. మీరు నన్ను మిస్ అయ్యారా.. అంటూ ఈషా తన ట్వీట్లో పేర్కొంది.