‘దూకుడే దూకుడు’

Mahesh-babu-మహేష్ బాబు, శ్రీను వైట్ల కెరీర్ లో ఓ మైలురాయిగా మిగిలిపోయిన చిత్రం దూకుడు. వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తోందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ‘ఆగడు’ పైన కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. ‘దూకుడు’ బ్రాండ్ ని ఈ సినిమాకి వాడుకోవాలని చూస్తున్నారు శ్రీను వైట్ల. అందుకే.. ఈ సినిమాకి ‘దూకుడే దూకుడు’ అనే ట్యాగ్ లైన్ పెట్టినట్టు తెలిసింది. అయితే ఈ క్యాప్షన్ చూసి ఇది దూకుడుకి సీక్వెల్ అనుకొంటారేమో.. ? అని శ్రీను వైట్ల కాస్త ఆలోచిస్తున్నారు. మహేష్ మాత్రం ‘దూకుడే దూకుడు’ ట్యాగ్ లైన్ బాగుందని కితాబిచ్చేశారట. దూకుడు తీస్తున్నప్పుడే ‘ఆగడు’ గురించి ఆలోచన వచ్చిందట. అయితే సెట్స్ పైకి వెళ్లడానికి ఇంతకాలం పట్టింది. ఆగస్టులో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభిస్తారు.